Thursday, September 8, 2011

కుటీరం




తూర్పు,పడమర గోడలకు-
రెండు కిటికీలతో,
మాకొక
పన్నెండడుగుల గది మాత్రమే వుంది.

ఐతే ఏం?

ఆ కిటికీ దాటి,
ఈ కిటికీలో కనిపించడానికి,
సూర్యుడికి-
పన్నెండు గంటలు పడ్తుంది.

2 comments:

  1. మీ కవితలన్నీ అద్భుతంగా ఉన్నాయి...

    ReplyDelete